మల్కాజ్గిరి జిల్లా అర్బన్ బీజేపి ఎస్సీ మోర్చ స్పోక్ పర్సన్ రాయిని ఉదయ్ కిరణ్ కుమార్ బిజెపి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరనున్నారు. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చూపు మేరలో కూడా రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆదరణ కరువైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని, రాబోయే ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందమళ్ళ పరమేశ్వర్ రెడ్డి గెలుపుకు పూర్ణంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని అన్నారు.