Monday, April 21, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

కబ్జాచేశానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: రాజేందర్ రెడ్డి

కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయా లు వదిలేస్తా.. రేపు ఉదయం ఎనిమిది గంటలకు భద్రకాళి దేవాలయం వద్దకు కుటుంబ సభ్యులతో వస్తా.. వినయ్ భాస్కర్ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయాలి

37 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొదటిసారి అవకాశం రాబోతుంది

ఏనాడు ఒక్క తప్పు చేయలేదు అవకాశం వస్తుందంటే నిజస్వరూపాలు బయటపడుతున్నాయి

రాజకీయాల మీద విరక్తి చెందేలా కుట్రలు చేస్తున్నారు

వినయ్ భాస్కర్ ఎన్ని కేసులు మోపిన నిలదొక్కుకున్న

రాజేందర్ రెడ్డి అమ్ముడు పోతాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు

కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయా లు వదిలేస్తా

రేపు ఉదయం ఎనిమిది గంటలకు భద్రకాళి దేవాలయం వద్దకు కుటుంబ సభ్యులతో వస్తా

వినయ్ భాస్కర్ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయాలి

డబ్బులు తీసుకున్నట్లు, ఇతర పార్టీలకు అమ్ముడుపోయానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా

నువ్వు మగాడివి అయితే నిరూపించు లేకుంటే నువ్వు ఎన్ని కబ్జాలు చేసావో నేను నిరూపిస్తా

మనిషి పుట్టుక పుడితే అక్కడికి వచ్చి నిరూపించాలి

నాపై మర్డర్ కేసు పెట్టి నన్ను, నా కుటుంబాన్ని రెండు నెలలు చాలా ఇబ్బందులు పెట్టారు

ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు

2014 లోనే చెడ్డి గ్యాంగ్ తరహాలో రాష్ట్రానికి వచ్చారు

మా దాంట్లో కొంతమంది దుర్మార్గులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు

మళ్లీ అమ్ముడు పోతాడు అంటూ సెల్ ఫోన్ లో మా వాళ్లే కొంతమంది సందేశాలు పంపిస్తున్నారు

స్లం ఏరియాలను ఎంచుకొని 2, 3 వేలు పంచి గెలుద్దాం అనుకుంటున్నారు

మేధావులు కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి

నా ఆస్తులను మీ ముందు ఉంచుతాను, నా డాక్యుమెంట్లు అన్నీ మీ ముందు ఉంచుతాను

యూనివర్సిటీ గేట్ ఎదుట చెప్పులదండ కట్టి కూర్చుంటా

యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థుల తో చర్చించి ఎవరు కబ్జా చేశారు అక్కడే తేల్చుకుందాం

నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తా

గత ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్చులకోసం కొంత ఇచ్చారు

రాఘవరెడ్డి 30 సంవత్సరాల నుంచి నాకు పరిచయం

రెండు చేతులు జోడించి అడిగా నాకు సహకరించమని..

ఆయన కూడా ఎవరికి టికెట్ వచ్చిన గెలిపించుకుంటాం అని చెప్పారు

ఈ కార్యక్రమంలో కార్పొ రేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, టిపీసీసి ఎస్.సి డిపార్ట్మెంట్ కో ఆర్ది నేటర్ ఎం.పి.ఆనంద్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మీర్జా అజీజుల్లా బేగ్, జిల్లా INTUC చైర్మన్ కూర వెంకట్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఎస్.సి. డిపార్ట్మెంట్ డాక్టర్ పి. రామకృష్ణ, జిల్లా ఓబిసి డిపార్ట్మెంట్ చైర్మన్ బొమ్మతి విక్రమ్, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్, ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు పల్లకొండ సతీష్, జిల్లా డాక్టర్ర సెల్ల్ అధ్యక్షుడు డాక్టర్ శ్రవణ్, మున్నీసా బేగం, పులి రాజు, బొంత సారంగం, ఎర్ర మహేందర్,, ఇప్ప శ్రీకాంత్,నాయిని లక్ష్మా రెడ్డి, తౌటిరెడ్డి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్, అంబెడ్కర్ రాజు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులూ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!