
కార్యకర్తలను అదుకునే బాధ్యత నాది
రైతులను కోతుల బెడద నుండి కాపాడుతా….
పాలకుర్తి మండలం వివిధ గ్రామాల సమీక్ష సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలను ప్రతి ఒక్కరినీ కాపాడుకునే బాధ్యత నాదేనని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి, BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం పాలకుర్తి BRS పార్టీ కార్యాలయంలో పాలకుర్తి మండలంలో గ్రామాల వారీగా కార్యకర్తలతో సమావేశమై వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. అలాగే ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ….తనను తమ భుజస్కందాలపై వేసుకొని గెలిపిస్తున్న కార్యకర్తలను ఆర్థికంగా ఎదగడానికి తప్పకుండా తమ వంతు సాయం చేస్తాను అన్నారు. అలాగే ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కోతులను క్రమం తప్పకుండా పట్టించి, దూరంగా అడవుల్లో వేయించి, రైతులకు కోతుల సమస్య లేకుండా చేస్తానని మాట ఇచ్చారు.