
పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించింది కాంగ్రెస్ పార్టీ..
బిఆర్ఎస్ పార్టీ బిజేపి పార్టీ తో చేతులు కల్పి లోపాయికరి ఒప్పందంతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
ప్రజా దీవెన యాత్ర GWMC 57 వ డివిజన్ లో సమ్మయ్య నగర్ నుండి ప్రారంభమై ఇంజనీర్స్ కాలనీ, విద్యానగర్, కూడా కాలనీ,టీవీ టవర్, ప్రెసిడెన్సీ స్కూల్ రోడ్, సెయింట్ పీటర్స్ స్కూల్ లైన్, వెంకటరమణ కాలనీ నుండి సాగి లోకల్ డిపో గోకుల్ నగర్ వద్ద ముగిసింది.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ …
బిఆర్ఎస్ పాలనలో తెలంగాణాలో అభివృద్ధి అంత ఒక కేసిఆర్ కుటుంబానికే పరిమితమైంది. నీళ్ళు, నిధులు, నియమాకాలంటూ అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించింది.
మిగూ బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారు.
మ్యానిఫెస్టోలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఆర్భాటాలు, అబద్దాలు మాయమాటలతో పరిపాలన కొనసాగితున్నారు.
తోమ్మిదేంట్ల పాలనలో ముఖ్యమంత్రి హోదాలో కే.సి.ఆర్ వరంగల్ కు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు వరంగల్ నగరాన్ని వాషింగ్టన్ చేస్తామంటూ కేసిఆర్ ఇచ్చిన హామీ ఏమయిది?
నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం కలగానే మిగిలింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుంది.
పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించింది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు తమ శక్తి మేరకు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతుకు వెన్నెముకగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ
మనం ఏదైనా సాధించుకోవాలన్న, దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్న ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.
తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీకి మనం పూర్వ వైభవం తీవాలంటే ఈ సారి మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు బంక సతీష్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, ఎర్ర మహేందర్, మహమ్మద్ నజీర్, నాయిని ఉదయ్ రెడ్డి, పాల్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.