Wednesday, December 25, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

కమీషన్ల కక్కుర్తి తోనే మెడిగడ్డ బ్యారేజి క్రుంగింది : బిఎస్పీ

క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న బిఎస్పీ నాయకులు

రాజోలి :కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వేల కోట్ల స్కాం జరిగిన విషయం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బిఎస్పి పార్టీ నియోజకవర్గం ఇంచార్జి మధు గౌడ్, సీనియర్ నాయకులు బోరెల్లి మహేష్ అన్నారు.
అంతకుముందు నాయకులు మాందొడ్డి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం లో పాలోని యువతను ఎంకరేజ్ చేశారు.బుధవారం రాజోలి మండలం మాందొడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి పాలనలో కూరుకుపోయిందని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు పేరుతో కమిషన్లతో తమ జేబులు నింపుకున్నారని అన్నారు .కోటి ఎకరాల మాగాణికి నీళ్ళందిస్తామన్న కాలేశ్వరం ప్రాజెక్ట్ తో నాలుగు కోట్ల ప్రజలను మోసం చేశారని ఆయన తెలిపారు. కాళేశ్వరం ఫలాలు ప్రజలకు అందకుండానే నేడు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగి పోయిందని ఆయన తెలిపారు .పారదర్శకత లేని ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తూ నాణ్యత లోపాలను గాలికి వదిలేసి కమిషన్లు మాత్రమే దండుకుంటున్నారని తెలిపారు .ఇదే విషయమై బిఎస్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్న డిమాండ్లు:

  1. ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన కేసీఆర్ ఆస్తులను జాతీయం చేయాలి.
  2. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల ప్రజా ధనాన్ని వృదా చేసిన కేసీఆర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలి.
  3. కేసీఆర్ పై, ఇంజనీర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
  4. కాళేశ్వరం మేదిగడ్డ ప్రాజెక్టు ఫెయిల్యూర్ పై సుప్రీం కోర్టు జడ్జీ తో విచారణ జరిపించాలి.

అలంపూర్ నియోజకవర్గం లోని ప్రతి మండల కేంద్రాలలో మేడిగడ్డ ప్రాజెక్ట్ అవినీతిపై పత్రికల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని దీని ద్వారా ప్రజలకు మరింత అవినీతి ప్రభుత్వం గురించి తెలియజేస్తామని వారు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై రాబోవు రోజుల్లో బీఎస్పీ పార్టీ పోరాటం చేస్తుందని, కుటుంబ పాలనలో నడుస్తున్న తెలంగాణ లోని బీఆర్ఎస్ పార్టీ ఆగడాలను అడ్డుకొని, అవినీతి పాలన చేస్తున్న వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టేదాకా తమ పోరాటం ఆగదని తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గం అధ్యక్షులు తిరుపాల్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి రవి చందర్, నియోజకవర్గం మహిళా కన్వీనర్ నాగ జ్యోతి, రాజోలి మండలం అధ్యక్షులు వెంకటేష్, వడ్డేపల్లి మండలం అధ్యక్షులు లక్ష్మన్న, కన్వీనర్ జలందర్ వారి టీం, ఐజ మండలం నాయకులు బుడ్డన్న, ఆనంద్ రాజ్ , సురేందర్,మనోపాడ్ మండలం అధ్యక్షులు శాంతికుమార్,ఇటిక్యాల మండలం అధ్యక్షులు యువరాజ్ వారి టీం, ఉండవెల్లి మండలం అధ్యక్షులు ప్రభుదాస్ వారి టీం,అలంపూర్ మండలం అధ్యక్షులు సురేష్ వారి టీం తదితరులు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!