Friday, April 18, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

మహిళా పోలీసులు మా ఆడ పడుచులు: సీపీ డిఎస్ చౌహాన్

అంబర్పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణలో దసరా మరియు బతుకమ్మ వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ అన్నారు.
ఈ రోజు అంబర్పేట్ లోని సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా పోలీసుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాచకొండ సిపి చౌహన్, మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో దసరా మరియు బతుకమ్మ వేడుకలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ పండుగను ప్రతి మహిళ ఎంతో ఘనంగా ఇష్టంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు.

నిరంతరం వర్క్ తో బిజీగా ఉండే మహిళా పోలీసులకు తాము ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగను సంతోషంగా నిర్వహించుకోవడానికి అంబర్పేటలో ఏర్పాట్లు చేశామని కమిషనర్ తెలిపారు. మహిళా పోలీసులకు చక్కటి పని వాతావరణాన్ని కల్పించడం మాత్రమే కాక వారి సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కమిషనర్ తెలిపారు. మహిళా పోలీసులు తమ సంప్రదాయాలను పండుగలను అహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకునేలా తమ వంతు సహకారం అందిస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు.

రాచకొండ పరిధి లో ప్రతి సంవత్సరం ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతాయని, ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, పండుగ నిర్వహణకు ఎటువంటి అవాంతరాలు కలవకుండా అవసరమైన అన్ని రకాల భద్రత చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి మరియు నేర నియంత్రణలో అమ్మవారు రాచకొండ పోలీసులకు శక్తి ఇవ్వాలని కోరుకొంటున్నానని కమిషనర్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.

ఈ వేడుకలలో డీసీపిలు శ్రీబాల, ఇందిరా, మురళీధర్, అడిషనల్ DCPలు శ్రీనివాస్ రెడ్డి, శ్యాంసుందర్, వెంకట్ రెడ్డి, అనొక్ జైన్, ఏసీపీలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!