
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అల్మాస్ ఫంక్షన్ హాల్ సమీపంలో 24వ, వార్డులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ వార్డు కార్యాలయాన్ని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్… ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం రామయ్య బౌలికి చెందిన మైనార్టీ యువకులు ఖదీర్, అబ్దుల్ మాజీద్, ఖా, ఫరూక్, మునీర్, అబ్దుల్ అజీజ్, అక్బర్, డాక్టర్ అబెద్, ఎండి అహ్మద్, ఎండి ఇబ్రహీం మరియు శీను సహా సుమారు 100 మంది యువకులు మంత్రి, ఎంపీ సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, ఫ్లోర్ లీడర్ షబ్బీర్, వార్డు ఇంచార్జి హామెద్ షేక్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…
గతంలో రామయ్య బౌళి అంటేనే ఒక మురికి కూపం అనేలా ఉండేది వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇండ్లలోకి నీళ్లు వచ్చి ముంపు ఏర్పడే పరిస్థితి ఉండేది డంపింగ్ యార్డు లాంటి ఈ ప్రాంతాన్ని ఇప్పుడు జిల్లా కేంద్రంలోనే అత్భుతమైన పర్యాటక ప్రాంతంగా మార్చేశాం గతంలో రామయ్య బౌళిలో గజం కేవలం రూ.500 ఉండేది… ఇప్పుడది రూ.50 వేలకు చేరుకుంది.
మీ ఆస్తుల విలువ ఇప్పుడు 500 రెట్ల కంటే ఎక్కువగా పెరిగింది. శిల్పారామం, ట్యాంక్ బండ్, సస్పెన్షన్ బ్రిడ్జి వంటి అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైంది. ఎవరూ ఊహించని విధంగా మహబూబ్ నగర్ ను అద్భుతంగా తీర్చిదిద్దడం నా లక్ష్యం ఎవరూ కూడా దుబాయ్, ముంబాయి, పుణె లాంటి ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే నా ధ్యేయం. వలసలు వెళ్లిన వాళ్లు కూడా తిరిగి వచ్చేలా చేస్తాం నా జీవితం మహబూబ్ నగర్ అభివృద్ధికే అంకితం.