
తాజాగా చిన్నంబావి మండలం వెలగొండ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఈరోజు ఎల్లేని సుధాకర్ రావు సమక్షం లో బీజేపీ పార్టీ లో జాయిన్ కావడం జరిగింది..
గత నాయకుల పాలనలకు విసిగివేసారి పోయి ఈరోజు కొల్లాపూర్ ప్రాంతం కోసం ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సుధాకర్ రావు కి మద్దతు ఇవ్వడం కోసం ఈరోజు బిజెపి పార్టీలో జాయిన్ అవుతున్నామని సందర్భంగా వారు వెల్లడించారు…
అనంతరం ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ కొల్లాపూర్ అభివృద్ధి నోచుకోకపోవడానికి గల కారణం గత నాయకులు పరిపాలనే అని వారికి ఒక సరియైన విజన్ లేని కారణంగా ఈ ప్రాంతం వెనుకబాటుకు గురి అయిందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు..
అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కమలం జెండా కొల్లాపూర్ లో ఎగిరే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు తెలియజేసారు…