Monday, April 14, 2025
- Advertisement -spot_img
- Advertisement -spot_img

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు మీడియా చిట్ చాట్

మా అభ్యర్థులు 114 మంది అభ్యర్థులు ప్రచారం లో దూసుకుపోతున్నారు మిగతా ఐదుగురు అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తాం 

కాంగ్రెస్ కు 40 చోట్ల అభ్యర్థులే లేరు అలాంటపుడు 70 చోట్ల గెలుస్తాం అని ఎలా చెబుతారు… 

పాత రంగారెడ్డి కలిపి 29 సీట్లు ఇక్కడ 25 చోట్ల అభ్యర్థులు లేరు డబ్బులు  ఇచ్చిన వారికే టిక్కెట్లు  ఇస్తున్నారు ఈ మధ్య కాంగ్రెస్ నేత ఒకాయన కలిశారు కూకట్ పల్లి సీట్ కోసం ఆయన్ను 15 కోట్ల రూపాయలు అడిగారట గతం లో నేను చేప్పినట్టే కర్ణాటక లో అక్రమ డబ్బు జమఅవుతోంది…

అక్కడ స్క్వేర్ ఫీట్ కు 500 వసూల్ చేస్తున్నారు తెలంగాణ కు తరలించడానికి సిద్ధంగా ఉన్న 42 కోట్ల రూపాయలు కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో  దొరికింది 8 కోట్లు ఇదివరకే  కొడంగల్ కు చేరినట్టు మాకు సమాచారం ఉంది… 

కాంగ్రెస్ సిద్ధాంత ప్రాతిపదికన ఎన్నికలు  కొట్లాడటం లేదు మేము తొమ్మిదిన్నరేళ్ళు గా చేసిన పనుల గురించి చెబుతున్నాం ప్రోగ్రెస్ రిపోర్టు లాగా ప్రజలకు అన్నీ వివరిస్తున్నాం… 

మా కంటే మెరుగైన పాలనా నమూనా కాంగ్రెస్  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా నీతి ఆయోగ్ RBI రిపోర్టుల అన్నీ సూచీల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది ఎమ్మెల్యేను ఎన్నుకోవడానికి  కాదు ఈ ఎన్నికలు జరుగుతున్నది…

సార్వత్రిక ఎన్నికలు తండ్రి తన అమ్మాయిని ఎవరితో పెళ్లి చేయాలన్న దాని పై చాలా ఆలోచిస్తారు ఓటు వేసే ముందు కూడా ప్రజలు ఆలోచించాలి అమిత్ షా అబద్ధాలకు హద్దే లేదు అమిత్ షా మాపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి…

ప్రధాని ఎక్కడికి పోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి  ప్రభుత్వం అని తిడుతారు ప్రధాని కి అంత అహంకారమా రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ ఏం రాసిస్తే అది చదువుతారు ఈ ఎన్నికలు  తెలంగాణ గల్లీ ఆత్మగౌరవానికి ఢిల్లీ గుజరాత్ అహంకారానికి మధ్య పోటీ… 

తెలంగాణకు గుజరాత్ ,ఢిల్లీ అహంకారానికి మధ్య పోటీ పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరతానంటే ఆయన ఇంటికీ రేపే  వెళ్లి ఆహ్వానం పలకతా బీజేపీ ని వాళ్ళ నాయకత్వం వాళ్ళే సీరియస్ గా తీసుకోవడం లేదు బీజేపీ కి ఈ సారి కూడా 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయం… 

బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుంది సీఎం కేసీఆర్ ఈ సారి కూడా వంద స్థానాల్లో ప్రచారం  చేస్తున్నారు నేను GHMC ,సిరిసిల్లతో పాటు కామారెడ్డి ప్రచారం చేస్తాను

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!