
సింహపురి సేంద్రియ మేళా 2023 ను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డాII కాకాణి గోవర్ధన్ రెడ్డి
“సేంద్రియ ఆహార పదార్థాలు, చిరుధాన్యాల స్టాళ్లను ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ చిరంజీవి చౌదరి తో కలిసి సందర్శించిన మంత్రి కాకాణి”
రైతు సాధికార సంస్థ ద్వారా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్న మంత్రి కాకాణి
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, రైతుల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రత్యేకంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలన్న లక్ష్యంతో రైతు సాధికార సంస్థ విభాగాన్ని ఏర్పాటు చేశారని వివరించిన మంత్రి కాకాణి
ఈ సంస్థ ద్వారా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్న మంత్రి కాకాణి
కోవిడ్ మనకు అనేక గుణపాఠాలు నేర్పిందని…రసాయన రహితమైనటువంటి ఆహారం, అదేవిధంగా మిల్లెట్స్ లాంటి ఆహారాన్ని తీసుకోవాలన్న అవగాహన ప్రజల్లో రావడం గొప్ప పరిణామమని పేర్కొన్న మంత్రి కాకాణి
మిల్లెట్స్, ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం పెరగడం, అందుకు అనుగుణంగా రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడంతో, ప్రతిష్టాత్మకమైన “జైవిక్ అవార్డు” కూడా వచ్చిందని గుర్తు చేసిన మంత్రి కాకాణి
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి – సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్ధీకరణ పధకం కింద అల్లూరి చంద్రశేఖర్ రాజు కి 3 లక్షల 50 వేల రూపాయలు సబ్సిడీతో 10 లక్షల రూపాయల రుణ మంజూరు చెక్కును అందజేసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డాII కాకాణి గోవర్ధన్ రెడ్డి