మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గణేష్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 పథకాల విస్తృత ప్రచారం లో కాంగ్రెస్ శ్రేణులు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు హబ్సిగూడ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు పథకాలపై విస్తృతస్థాయి ప్రచారం చేసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గణేష్ నాయక్ . హబ్సిగూడ డివిజన్లో లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిక్లరేషన్ల గురించి వివరిస్తు ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేయడం జరిగింది. రాబోయే ఎలక్షన్లలో బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి,కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ సుధాకర్ చారి,పలకల నరసింహారెడ్డి, హబ్సిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కిషన్ నాయక్, చందు యాదవ్, శ్యాం కుమార్, శీను నాయక్, శ్రీకాంత్ నాయక్, జగపతి నాయక్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్, డివిజన్ మైనారిటీస్ చైర్మన్ గజ్జల రాజు తదితరులు పాల్గొన్నారు.