
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి మర్రి రాజశేఖర్‌రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాల్సిన మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి పేర్లు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. గోషామహల్ నుంచి నందకిశోర్, ఆశిష్‌కుమార్‌లలో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది.