మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటి వరకు రూ.4,78,71,931/- నగదు సీజ్ చేయడం జరిగిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ ఎస్ టి, పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ , బృందాల ద్వారా ఇప్పటి వరకు రూ.3 కోట్ల 94 లక్షల 77వేల 276/- నగదుతో పాటు
83 లక్షల 94 వేల 655 రూపాయల విలువ గల ఆభరణాలు, ఇతర వస్తువులు, సీజ్ చేశారు,4 వేల 802 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు , ఎక్సైజ్ శాఖ వారు 312 మందిపై కేసులు నమోదు చేసి, 326 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 23 బెల్ట్ షాపులను క్లోజ్ చేయడం జరిగిందని తెలిపారు . పోలీస్ శాఖ ద్వారా 897 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేయడం జరిగిందని,472 CRPF ద్వారా కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.753 మంది బైండోవర్ చేశారు.ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువుల పై 59 ఫిర్యాదులు రాగా,37 గ్రీవెన్స్ కమిటీ ద్వారా రిలవెంట్ డాక్యుమెంట్స్ తో 2 కోట్ల 86 లక్షల 53 వేల 450 రూపాయల విలువ గల ఆభరణాలు, రిలీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల, అధికారి కలెక్టర్ గౌతమ్ తెలిపారు.