Tuesday, December 24, 2024
- Advertisement -spot_img
- Advertisement -spot_img

2024 -2025 ఉగాది పంచాంగం. క్రోధి నామ ఉగాది: ఏ రాశి వారికి అనుకూలం?

2024 -2025 ఉగాది పంచాంగం. శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు.
ఈ ఏడాది 12 రాశులవారి ఆదాయ-వ్యయాలు, అనుకూలత ప్రతికూలతలతో పాటూ వార్షిక ఫలితాలు అందిస్తోంది FM NEWS TELUGU.

మేష రాశి (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
శ్రీ కోధి నామ సంవత్సరంలో మేష రాశివారికి ఆదాయం 8; వ్యయం 14 రాజపూజ్యం 4; అవమానం 3 . ఈ రాశి వారికి ఈ ఏడాది గురు, శని గ్రహాల ప్రభావం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ ఆలోచనా విధానం ఇతరులకు అనుసరణీయంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో కొంత ప్రతికూలత ఎదురైనా, తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఈ రాశికి చెందిన వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులు శుభ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు కష్ఠానికి తగిన ఫలితం లభిస్తుంది. స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. మార్చి 29 నుంచి మేషరాశివారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. నివారణ కోసం శని రాహు గ్రహాల, శ్లోకం పఠించండి మేలుచేస్తుంది.

వృషభ రాశి (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
శ్రీ క్రోధినామ సంవత్సరం వృషభ రాశివారికి ఈ ఏడాది ఆదాయం 2; వ్యయం 8; రాజపూజ్యం 7; అవమానం 3 ఉంటుంది. శని, గురు గ్రహాలు అనుకూలత వలన మీకు క్రోధినామ సంవత్సరం కలిసి వస్తుంది. మీరు ఏ కార్యం తలపెట్టినా విజయ వంతంగా పూర్తి చేస్తారు. వివాహం అయినవారు తమ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్థిరాస్తులు వృద్ధి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి . అపనిందలు, అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది, మానసిక స్థైర్యం తో వాటిని అధిగమించండి. వాహన ప్రమాదం పొంచి ఉంది అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి విద్యార్థులకు గురుబలం అనుకూలంగా లేకపోవటం అపజయం తప్పదు. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యా, ఉద్యోగార్థం విదేశాలకి వెళ్లాలన్న ఆలోచన సఫలమవుతుంది. అవివాహితులకు నిరాశ తప్పదు. శుభఫలితాలకై గురు, శని, కేతు శ్లోకాలు పఠించండి.

మిథున రాశి (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఈ ఏడాది మిథున రాశివారి కందాయ ఫలితాలు ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 6 . ఈ రాశి వారికి క్రోథి నామసంవత్సరం అద్భుత ఫలితాలిస్తుంది. మీ తెలివితేటలతో ఇతరులని ఆకట్టుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. రుణ విముక్తులవుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గురుడు, శని , రాహువులు అనుకూల స్థానంలో ఉండటం వలన వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. విద్యార్ధుల కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయం. ప్రమోషన్స్ పొందే అవకాశముంది. శుభఫలితాలకై శని, కేతు శ్లోకాలు నిత్యం పటించాలి. మొత్తానికి క్రోధి నామ సంవత్సరం మిథున రాశికి మంచి ఫలితాలను అందిస్తుంది.

కర్కాటక రాశి (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశివారికి ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 6; అవమానం 6 ఉంటుంది.ఈ రాశి వారికి ప్రస్తుతం అష్టమ శని ఉండటం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గురుడు శుభ స్థానంలో ఉండడం వల్ల ఆ కష్టాలకి ఎదురు నిలుస్తారు. ఈ ఏడాది ఈ రాశికి చెందిన అన్ని రంగాలవారు వృద్ధిలోకి వస్తారు. నూతన గృహం ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడుపుతారు. విద్యార్థులకి అనుకూలమైన సమయం. సర్వత్రా విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులుకి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలదు. ఈ రాశి వారికి మే నెల నుంచి విశేషంగా ఉంటుంది. అవివాహితులకి వివాహ యోగం ఉంది. మీకు అనుకూలంగా ఉండే భాగస్వామి లభిస్తుంది. వివాహితులకి సంతాన యోగం కలదు.

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
సింహరాశివారికి ఈ ఏడాది ఆదాయం 2; వ్యయం 14; రాజపూజ్యం 2; అవమానం 2 . ఈ రాశి వారికి ఈ ఏడాది గ్రహబలం అనుకూలంగా లేకపోవటం వలన అంతగా సానుకూలత లేదు. అష్టమంలో రాహువు, దశమంలో గురువు ఉండటం కారణంగా కొన్ని చికాకులు తప్పవు. అనారోగ్య సూచనలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి. మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి. వివాదాలకి దూరంగా ఉండండి. ఆదాయ వృద్ధి ఉంటుంది. మీకున్న ఆత్మవిశ్వాసంతో ముందుకి సాగండి. అనుకూలత కోసం రాహు, కేతు గ్రహాలు జపాలు చేయండి. ఈ రాశి వారికి మే నెల వరకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలుంటాయి.

కన్యా రాశి (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
కన్యా రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం 5 , వ్యయం 5 , రాజపూజ్యం 5, అవమానం 2 , ఈ ఏడాది ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. మిత్రులే శత్రువులుగా మారే అవకాశముంది. మీ సన్నిహితులు మీకు కీడు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. మే నెల నుంచి ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. విద్యార్థులకి అనువైన కాలం. ఉద్యోగస్తులకి ఉన్నత ఉద్యోగ అవకాశాలు, విదేశీయానం ఉంటుంది. అవివాహితులకి వివాహ యోగం. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి సకల శుభాలు చేకూరుతాయి. అనుకున్న లాభాలు సాధిస్తారు.

తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
తులా రాశివారికి ఈ ఏడాది ఆదాయం 2; వ్యయం 8; రాజపూజ్యం 1; అవమానం 5 , ఈ ఏడాది ఈ రాశివారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. కార్య సిద్ది. సంపూర్ణ దైవనుగ్రహం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అష్టమ స్థానంలో గురుడు సంచరించుట వలన కుటుంబంలో కొంత అశాంతి, ఒత్తిడి నెలకొంటాయి. అవివాహితులకి వివాహ యోగం. సంతానం లేని వారికి సంతాన యోగం కలదు. శుభఫలితాలకై గురు, శని, కేతువుల శ్లోకాలను పఠించండి.

వృశ్చిక రాశి (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వృశ్చిక రాశివారికి ఈ ఏడాది ఆదాయం 8; వ్యయం 14; రాజపూజ్యం 4; అవమానం 5 ఉంటుంది. క్రోధి నామ సంవత్సరం వృశ్చిక రాశివారికి అనుకూల ఫలితాలనిస్తుంది. ఏడో స్థానంలో గురుడు సంచరించుట వలన వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి అనుకూల ఫలితాలు లభిస్తాయి. మానసిక ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడుతాయి. తీర్థ యాత్రలు చేస్తారు. మే తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. స్థిర, చరాస్తులు కొనుగోలుకు మంచి సమయం. ఏడాది ద్వితీయార్థంలో వివాహ యోగం ఉంది. సంతానం లేని వారికి సంతానభాగ్యముంది. గురు, శని, రాహువుల ధ్యానం శుభ ఫలితాలనిస్తుంది.

ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ధనస్సు రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆదాయం 14; వ్యయం 14; రాజపూజ్యం 3; అవమానం 1. ఈ రాశి వారికి ఈ ఏడాది అత్యంత శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెంపుపొందుతాయి. గురుబలం వల్ల ఎలాంటి సమస్యల్ని అయినా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకి, ఉద్యోగస్తులకు శుభ సమయం. అద్భుత ఫలితాలు సాధిస్తారు. శని, కేతు, గురు శ్లోకాలు పఠనం మంచిది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
మకర రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 7; అవమానం 5 . ఈ రాశి వారికి ఈ ఏడాది అద్భుతంగా ఉంటుంది. సర్వత్రా అనుకూలత ఉంటుంది. ఏ కార్యం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో మీ సమస్యలకీ మీరే పరిష్కారం కనుగొంటారు. ఆదాయంతో పాటూ పెరిగిన ఖర్చులు కొంచెం ఇబ్బంది పెడతాయి. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. విద్యార్థులకి, వ్యాపారస్తులకి, వృత్తి నిపుణలకి శుభ ఫలితాలుంటాయి. భూ, గృహ, వాహన యోగాలు కలవు. ఈ రాశివారు సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహం కానివారికి అనుకూల సమయం. మరిన్ని శుభఫలితాలకై రాహు, గురు శ్లోకాలు పఠించండి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కుంభ రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం 14; వ్యయం 14; రాజపూజ్యం 6; అవమానం 1. ఈ రాశి వారికి ఈ ఏడాది ఒడిదుడుకులు తప్పవు. ఆదాయం వృద్ధి చెందుతుంది. సెప్టెంబరు నుంచి చికాకులు , అనారోగ్య సమస్యలు, వెంటాడుతాయి. వివాదాల్లో చిక్కుకుంటారు. ఉద్యోగస్తులకి కొన్ని చికాకులు తప్పవు. ఎంత కష్ట పడినా ఫలితం ఉండదు. విద్యా, వ్యవసాయ రంగాల వారు నిరాశకి గురవుతారు. గురు, శని, రాహు, కేతు గ్రహాల శ్లోకాలు పఠించండి.

మీన రాశి (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
మీన రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 2; అవమానం 4 కలవు. ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తున్నది. గురుబలం అధికంగా ఉండటం వలన శని ప్రభావం తగ్గుతుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బావుంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడుపుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. విద్యార్థులు కష్టపడితే విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఈ ఏడాది మిశ్రమంగా ఉంటుంది.

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!